Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం..

ప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం..

లయన్స్ క్లబ్ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం : ప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి ఉలవల నాగరాజు, సభ నిర్వాహకులు వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి క్యాంపు దాతగా కీర్తిశేషులు మెటికల చెన్నమ్మ, కీర్తిశేషులు మెటికల చెన్నప్ప ఙ్ఞాపకార్థం కుమారుడు లయన్ మెడికల కుల్లాయప్ప వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం డిఆర్టిఏ వెలుగు పీడీ.ఈశ్వరయ్య, అనంతపురం ఫిజికల్ డైరెక్టర్ సునీత పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ కమిటీ వారు మాట్లాడుతూ భారత దేశంలోనే లయన్స్ క్లబ్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు వేలాదిమందికి లయన్స్ క్లబ్ ద్వారా కంటి వెలుగును ప్రసాదించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కంటిలోని శుక్లమును తొలగించి కంటిచూపు కోసం మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. నేడు లయన్స్ క్లబ్ సేవలు పేదలకు వరంలాగా మారడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 58 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 35 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు ఈశ్వరయ్య, సునీత మాట్లాడుతూ కంటి చూపును కలిగించడంలో ధర్మవరం లైన్స్ క్లబ్ ముందంజలో ఉందని, ఇందుకు అందరూ ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా సమాజంలో నేత్రదానం కూడా చేస్తే ఇరువురికి కంటి చూపు లభిస్తుందని తెలిపారు. కావున ప్రతి పేదవాడు లైన్స్ క్లబ్ సేవలను వినియోగించుకున్నప్పుడే క్లబ్ కు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మోహన్దాస్, గోశే రాధాకృష్ణ, రాజగోపాల్, పళ్లెం వేణుగోపాల్ ,పుట్లూరు నరసింహులు, సాగా సురేష్, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు