Homeఆంధ్రప్రదేశ్పేదరికం లేని సమాజం కోసం 

పేదరికం లేని సమాజం కోసం 

- Advertisement -

 

 భాగస్వాములు కండి….. మంత్రి కందుల దుర్గేష్

విశాలాంధ్ర- నిడదవోలు :

పేదరికం లేని సమాజం కోసమే పీ4 విధానమని,పీ4లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నిడదవోలులోని స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో పీ4 అమలు పై  మంత్రి కందుల దుర్గేష్ అధికారులు భాగస్వాములతో  పలు అంశాలపై సమక్షించారు. ఈ సందర్భం దుర్గేష్ మాట్లాడుతూ బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలన్నారు.సమాజం బాగుండాలన్న సత్సంకల్పంతో పేదరికం లేని సమాజం కోసమే సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్) విధానం తీసుకొచ్చారని, ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పీ4 అమలు ద్వారా భవిష్యత్ లో సమాజంలో మంచి మార్పు వస్తుందని మంత్రి దుర్గేష్ ఘంటాపథంగా వెల్లడించారు. ఈ క్రమంలో బంగారు కుటుంబాలను,మార్గదర్శులను అనుసంధానం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 7862 బంగారు కుటుంబాలను, 19901 మంది బంగారు కుటుంబంలో వ్యక్తులను, 685 మంది మార్గదర్శులను గుర్తించడం జరిగిందన్నారు.  వారు ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడం కోసం అనుసంధానం చేస్తున్నామన్నారు.

భవిష్యత్ లో బంగారు కుటుంబాలు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కేవలం డబ్బుకన్న వాళ్లే మార్గదర్శులుగా ఉండాలన్న నిబంధనేమీ లేదని, నైపుణ్యాలను పంచుకోవడం ద్వారా, తమకు తోచిన సాయం చేయడం ద్వారా కూడా మార్గదర్శులుగా మారవచ్చన్నారు. కేవలం వ్యాపారస్థులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల సీఎం కొవ్వూరు నియోజకవర్గం వచ్చిన సమయంలో జరిగిన ఆసక్తికర ఘటనను వివరించారు. బంగారు కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి ఒక మార్గదర్శి వల్ల బాగా చదువుకోగలుగుతున్నానని, భవిష్యత్ లో తాను మార్గదర్శిగా మారతానన్న విషయం ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ అమ్మాయి భవిష్యత్ లో పది మందికి సాయం చేసే స్థాయికి ఎదగుతానన్న స్ఫూర్తిదాయకమైన మాటలను మంత్రి గుర్తుచేశారు.  బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలని మంత్రి దుర్గేష్ సూచించారు.  అంతేగాక  పేదల కళ్లలో ఆనందం నింపేందుకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో భాగం పంచుకోవాలన్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో  17 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించి సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకొని విధంగా ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి కార్యక్రమం ఉపకరిస్తుందని భావిస్తున్నామన్నారు.మార్పు కోసం ముందడుగు వేసే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్ధీన్, కౌన్సిలర్లు నిడదవోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె. సతీష్, పెరవలి మండల ప్రత్యేక అదికారి ఎం.సునీల్ వినయ్, నిడదవోలు మండల ఎంపీడీవో వీఎస్ వీఎల్ జగన్నాధ రావు, మున్సిపల్ కమిషనర్ తోటా శ్రీకృష్ణవేణి, నిడదవోలు మండల తహశీల్దార్ బి.నాగరాజు నాయక్, ఉండ్రాజవరం మండల ఎంపీడీవో వీ.వీ.వీ.ఎస్ రామారావు, ఉండ్రాజవరం మండల తహశీల్దార్ పీఎన్ డీ ప్రసాద్, పెరవలి మండల ఎంపీడీవో గంటా శ్రీనివాసు,పెరవలి మండల తహశీల్దార్ కె.నిరంజన్, నిడదవోలు మండల జనసేన పార్టీ అద్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఉండ్రాజవరం మండల బీజేపీ పార్టీ అద్యక్షులు కె.సత్యనారాయణ (బాలాజి),   నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు