Homeఆంధ్రప్రదేశ్ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. 

- Advertisement -

— విల్సన్ పాల్.

విశాలాంధ్ర – కడియం : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యల సాధనకొరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం ఈరోజు కడియం గ్రామ సచివాలయంలో జరిగింది. ఆగష్టు 5 న ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగులకు రావలసిన 30 వేల కోట్ల బకాయిల చెల్లింపు, డిఏ, ఐ ఆర్, పిఆర్సి కమిషన్ ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులతో వారి కార్యాలయంలోనే సమావేశమై టీ త్రాగుతూ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను తెలిసికొని ప్రభుత్వానికి నివేదించి సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడిన  వీడియోను ప్రదర్శించి ఉద్యోగుల సమస్యలను గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి సిహెచ్ఎస్ విల్సన్ పాల్, జిల్లా జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాసరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు