వాషింగ్టన్: అంతర్జాతీయంగా పలు సంక్షోభాలు పరిష్కరించడంలో తాను కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి అదే మాట మాట్లాడిన ట్రంప్… ఆ రెండు దేశాలు అణుయుద్ధం అంచుల వరకు వెళ్లాయన్నారు. ఆ సమయంలో 6-7 విమానాలు నేల కూలాయన్న ట్రంప్… రెండు దేశాల ఘర్షణను తామే పరిష్కరించినట్లు పునరుద్ఘాటించారు. గత ఆరు నెలల్లో ఆరు యుద్ధాలు ఆపానంటూ వైట్‌హౌస్‌లో వెల్లడిరచారు. ‘గత ఆరు నెలల వ్యవధిలో ఆరు యుద్ధాలు ఆపాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. భారత్-పాక్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. 6 నుంచి 7 విమానాలు నేలకూలాయి. ఆ రెండు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమవగా… వాటిని మేమే పరిష్కరించాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్… తమ నిర్ణయంలో ఎటువంటి విదేశీ జోక్యం లేదని స్పష్టంచేసింది. ఈ అంశంపై లోక్‌సభలో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై దాడులు ఆపాలని తమకు ఏ దేశం చెప్పలేదని బుకాయించారు. నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేసుకున్న తర్వాతే ఆపరేషన్‌కు విరామం ఇచ్చామన్నారు.
భారత్-పాక్ అణుయుద్ధం ఆపా: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


