విశాలాంధ్ర – కడియం : కడియం మండలం జేగురుపాడు గ్రేడ్-1 పంచాయతి కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావుకు జిల్లా ఉత్తమ సేవా పురస్కారం లభించింది. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పన్నుల వసూళ్లులో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం దక్కింది. రాజమహేంద్రవరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలక్టర్ చిన్నరాముడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనివాసరావు అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న శ్రీనివాసరావును ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, పాతురి రాజేష్, ఎంపిటిసి నాగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఎంపీడీవో కె రమేష్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
జేగురుపాడు పంచాయతీ కార్యదర్సికి ఉత్తమ సేవా పురస్కారం.
- Advertisement -
RELATED ARTICLES


