కనిగిరి డి.ఎస్.పి సాయి ఈశ్వర యశ్వంత్
విశాలాంధ్ర -వెలిగండ్ల: శిరశాస్త్రంపై ప్రజలకు అవగాహన కల్పించి వారి ప్రాణాలను కుటుంబ బాధ్యతను గుర్తు చేసే విధంగా ప్రోత్సహించాలని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర యశ్వంత్ కోరారు.గురువారం మండలంలోని వెలిగండ్ల పోలీస్ ఠణకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు అనేక పనులతో ద్విచక్ర రహదారులపై ప్రయాణిస్తున్నందున కుటుంబం వారిపై ఆధారపడి ఉంటున్నందున కుటుంబ యజమానిపై బరువు బాధ్యతలు ఉన్నాయని అలాంటి వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నుండి సంరక్షణ పొందేందుకు ప్రమాదాలు జరిగినప్పుడు శిరశాస్త్రం ధరించి ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆ విధంగా ప్రజలను అవగాహన కల్పించాలని విలేకరులను కోరారు ఈ క్రమంలో విలేకరులకు ఎస్ఐ కృష్ణ పావని సహకారంతో హెల్మెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పామూరు సిఐ భీమా నాయక్ ఎస్ఐ కృష్ణ పావని పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


