Homeఆంధ్రప్రదేశ్సమాజ గతిని మార్చేది గురువులే

సమాజ గతిని మార్చేది గురువులే

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ఏ సమాజంలో ఉన్నత ఆశయాలు కలిగిన గురువులుంటారో ఆ సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ అన్నారు. కీర్తిశేషులు వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కడియం మండలంలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవిరామ్ కిరణ్ పాల్గొని మాట్లాడారు. ట్రస్ట్ గౌరవాధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఆదర్శ ఉపాధ్యాయుడు, ఆదర్శ రాజకీయ నాయకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయుల పుట్టినరోజుగా జరుపుకోవడం విశేషమన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం మాట్లాడుతూ మండలంలోని తొమ్మిది ఉత్తమ ఉపాధ్యాయులను మాట్రస్ట్ ద్వారా సత్కరించడం మాకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, మండల విద్యాధికారులు మణికుమార్, నాగేశ్వరరావులు, నీటి సంఘం అధ్యక్షులు చిక్కాల ఈశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు జి పాల శంకర్, జి ఆనంద్, టివి అరుణ గాయత్రి, జి శరత్ బాబు, ఎన్ శ్రీవల్లి తాయారు, ఎం బ్యులారత్నం, పి రమా నాగేశ్వరి, కె గంగాభవాని, గొల్లపల్లి సత్యనారాయణ లను ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం సత్యవతి,  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు