విశాలాంధ్ర – తాళ్లపూడి : రైతాంగం తమ పంటకు శాస్త్రీయంగా అవసరమైన మేరకు మాత్రమే యూరియా వాడాలని, అవసరానికి మించి యూరియా కానీ ఎరువులు వాడటం వల్ల భూమి సాంద్రత కోల్పోతుందన్న విషయం తెలుసా అని రైతులతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖాముఖి మాట్లాడారు. ఆమె గురువారం సడన్ గా తాళ్లపూడి మండలానికి విచ్చేసి రాగోలపల్లి, అన్నదేవరపేట సొసైటీ లను సందర్శించి, ఎరువుల వినియోగం, సరఫరా పరిస్థితిలను ఆరాతీశారు.యూరియా అవసరమైనంత నిల్వ ఉందని, బయ పడాల్సిన పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ , భూసారం, పంట విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా ఎరువులను వినియోగించు కోవాలని రైతులకు సూచించారు. అన్నదేవరపేట సొసైటీలో ఈ సీజన్లో 65 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని, ఇది గత సీజన్ కంటే ఎక్కువ అని కలెక్టర్ వివరించారు. రాగోలపల్లి సొసైటీలో మాత్రం గత సీజన్, ప్రస్తుత సీజన్ వినియోగం దాదాపు ఒకే స్థాయిలో ఉండి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం పంటలకు సరిపడే విధంగా ఎరువులు కేటాయించి సమయానికి సరఫరా చేస్తోందని, యూరియా సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. పంట సాగు కు అనుగుణంగా దశల వారీగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ, తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీ లావణ్య,వ్యవసాయాధికారిని రుచిత, ఆర్.ఐ రామకృష్ణ, సిబ్బంది, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు
యూరియా ఎక్కువ వాడితే ప్రమాదమే జిల్లా కలెక్టర్ ప్రశాంతి
- Advertisement -
RELATED ARTICLES


