Homeఆంధ్రప్రదేశ్సొసైటీలను సందర్శించిన ఆర్టీవో

సొసైటీలను సందర్శించిన ఆర్టీవో

- Advertisement -

ఎరువుల దుకాణాల తనిఖీ, యూరియా నిల్వల పరిశీలన

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ రాణి సుస్మిత గురువారం దొమ్మేరు, కాపవరం , కొవ్వూరు లలో ఉన్న ప్యాక్ సొసైటీ లను సందర్శించడం జరిగింది. ప్యాక్ సొసైటీ, గోదాములను సందర్శించి యూరియా నిల్వలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు.రైతులకు సరఫరా అయ్యే ఎరువులు సక్రమంగా వినియోగమవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.రైతులు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు దశలవారీగా ఎరువులను వాడాలని, అవసరానికి మించి ఎరువులు–పురుగుల మందులు వాడితే పంటలకు మేలు కంటే నష్టం కలుగుతుందని ఆర్డీవో స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మార్వో దుర్గాప్రసాద్ ప్యాక్ సొసైటీ సిబ్బంది, ఎరువుల దుకాణాల యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు