విశాలాంధ్ర పుట్టపర్తి :- మున్సిపాలిటీలో సమగ్రత్రాగునీటి పథకాన్ని త్వరితగీతన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లకు,మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ కు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి మున్సిపల్ సమగ్ర త్రాగునీటి అభివృద్ధి పనులపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు .పుట్టపర్తి మున్సిపాలిటీకి సమగ్ర త్రాగునీటి పథకానికి రాష్ట్ర పురపాలక శాఖ నుంచి రూ.136 కోట్లు నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలో సమగ్రత్రాగునీటి పథకం ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, 2014 నుంచి 2019 అప్పటి టిడిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మన మున్సిపాలిటీకి సమగ్ర త్రాగునీటి పథకాన్ని తాను మంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు కొనసాగిన వైసిపి ప్రభుత్వం 100 కోట్లతో మంజూరైన ఈ సమగ్ర త్రాగునీటి పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమగ్ర త్రాగునీటి పథకాన్ని పునర్ధరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,పురపాల శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి వీటికి నిధులు మంజూరు అయ్యేలా అత్యంత శ్రద్ధ తీసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన ప్రతి హామీని ఐదేళ్లలో తప్పకుండా నెరవేరుస్తామని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ. రామ్మోహన్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ ,పబ్లిక్ హెల్త్ డి ఈ నరసింహామూర్తి, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
త్రాగునీటి పథకం పనులు త్వరితగతిన చేపట్టండి:-ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


