Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా కోర్టుకు స్థలపరిశీలన...

జిల్లా కోర్టుకు స్థలపరిశీలన…

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి :-శ్రీ సత్య సాయి జిల్లాలో జిల్లా కోర్టు కోసం హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాద్ స్థల పరిశీలన చేశారు. శనివారం ప్రశాంతి నిలయం శాంతిభవనం కి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ చేరుకోగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జ్ సయ్యద్ ముజీబ్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు జడ్జి శాంతిభవనం నుంచి కప్పలబండ పొలంలో జిల్లా కోర్టు ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. రెండు చోట్ల స్థలాలను పరిశీలించి ఇందులో మెరుగైన వసతులు కలిగిన వాటిలో కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆయన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శాంతిభవనం చేరుకున్నారు. సాయంత్రం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు