విశాలాంధ్ర…..హీరేహల్, మండలం సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 2 వరకు హీరేహల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో “స్వస్థ నారీ – శక్తివంతమైన కుటుంబం అభియాన్” మంగళ వారం ఆరోగ్య శిబిరాలు నిర్వహించబడనున్నాయనీ వైద్యాధికారి డా. శ్రవణ్ కుమార్ , డా నజీనీన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –“అభియాన్ లో భాగంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు యాంటినేటల్ చెకప్, రక్తపోటు, షుగర్, కంటి, ENT, దంత పరీక్షలు, రక్తహీనత (అనీమియా), క్షయవ్యాధి (TB), సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహిస్తామన్నారు . అదేవిధంగా నోటి, స్తన, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, రోగనిరోధక టీకాలు, టెలీమెడిసిన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. పోషకాహారం ప్రోత్సాహం, రుతుక్రమ పరిశుభ్రత, స్థానిక ఆహార పదార్థాల వినియోగం, ఊబకాయం తగ్గింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ వైద్య సిబ్బందికి దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు “దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంటి చుట్టూ నిల్వ నీరు లేకుండా చూడాలన్నారు, ట్యాంకులు, డబ్బాలు మూతలతో ఉంచాలన్నారు, రాత్రిపూట దోమలతెరలు ఉపయోగించడం, శుభ్రత పాటించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను సమర్థంగా నివారించవచ్చని సూచించారు. “ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ సాధ్యం. ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత ఉంటేనే గ్రామం ఆరోగ్యవంతం అవుతుంది” అని నాగేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం లు, ఎం ఎల్ హే చ్ పీ లు , హెల్త్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.


