ఎన్జీవో హోం అధ్యక్షులు పెనుబోలు శంకర్. బిజెపి జిల్లా అధ్యక్షులు డోల రాజారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో ఈనెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి, ఎన్జీవో హోం అధ్యక్షులు పెనుబోలు శంకర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొని ప్రతి ఒక్కరికి మూడు రోజులు పాటు ఉదయం టిఫిన్ సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు ఎంట్రీ ఫీజు 300/- రూ ఈనెల 24వ తేదీ లోపు చెల్లించాలన్నారు. ఈ టోర్నమెంట్ ఉదయం 6.గంటల నుంచి సాయంకాలం 4.గంటల వరకు నిర్వహించబడును అని తెలిపారు.
విజేతలకు సత్యసాయి జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి అన్ని బహుమతులు విరాళంగా అందజేస్తున్నారు అన్నారు.
మొదటి బహుమతి :10,000/-,
రెండవ బహుమతి : 7,000/-,
మూడవ బహుమతి :5,000/-,
నాలుగవ బహుమతి:3,000/-నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు.
ఎన్జీవో హోమ్ లో ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహణ..
- Advertisement -
RELATED ARTICLES


