విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న జరిగే ఛలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు. శనివారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో ఛలో విజయవాడ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించి పాఠాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యూటీ, పిఎఫ్ తదితర బెనిఫిట్స్ సకాలంలో చెల్లించాలని కోరుతూ అక్టోబర్ 7న విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లప్ప, రవీంద్ర, నబి సాహెబ్, గుంటప్ప, ఈరన్న, దామోదర్, రాజేంద్ర, దరగయ్య, శ్రీధర్, బీరప్ప, నాగజ్యోతి, హేమ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


