జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బోయ శ్రీరాములు
విశాలాంధ్ర అనంతపురం : పొగాకు కు యువత దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బోయ శ్రీరాములు పేర్కొన్నారు.టోభాకో ఫ్రీ యూత్ కాంపెయిన్ 3.O* సందర్భంగా మంగళవారం పంతుల వారి కాలనీ రుద్రంపేట 2, అంగన్వాడి సెంటర్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో జిల్లా పొగాకు నియంత్రణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ శ్రీరాములు మాట్లాడుతూ…జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టో పొగాకు వ్యతిరేకంగా ప్రజలలో మరియు ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా సిగరెట్టు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియజేశారు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ క్యాన్సర్ వంటి భయానిక వ్యాధులు రాకుండా నివారించుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రుద్రంపేట సచివాలయం 2 ఆరోగ్య సిబ్బంది, జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు మరియు పి హెచ్ ఎన్ పద్మావతి, హెల్త్ సూపర్వైజర్ , ఏ ఎన్ ఎం ఎస్ , ఆశ, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
పొగాకు కు యువత దూరంగా ఉండాలి
- Advertisement -


