Homeజిల్లాలుఅనంతపురంనిలిచి ఉన్న కంటైనరును ఢీకొన్న కారు..

నిలిచి ఉన్న కంటైనరును ఢీకొన్న కారు..

- Advertisement -

ఒకరి పరిస్థితి విషమం ఇద్దరికి తీవ్ర గాయాలు

విశాలాంధ్ర-రాప్తాడు.. నిలిచి ఉన్న కంటైనరును కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారి పక్కన మహీంద్రా ట్రక్ షోరూం సమీపంలో హెచ్ఆర్ 55ఎ-7559 అనే కంటైనరును ఆదివారం మధ్యాహ్నం దాదాపు 1.30గంటల సమయంలో ఆ వాహన డ్రైవర్ వాసిబ్ నిలుపుకున్నాడు. అదే సందర్భంలో 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుంచి ఎన్1ఎల్-0457 నంబర్ ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా కారులో శబరీష్, రాజ్ కుమార్, లలిత ప్రయాణిస్తున్నారు. మహీంద్రా షోరూం వద్దకు రాగానే కారు ఉన్నపలంగా కంటైనరును ఢీకొంది. కారులో ఉన్న శబరిష్ కు తీవ్ర గాయాల పరిస్థితి విషమంగా ఉంది. మిగతా రాజ్ కుమార్, లలితకు స్వల్ప గాయాలు కాగా ముగ్గురిని ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు