Homeజిల్లాలువిజయనగరంసన్ స్కూల్ విద్యార్థులు కరాటే లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

సన్ స్కూల్ విద్యార్థులు కరాటే లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం సన్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం నాడు జరిగిన జిల్లా జూనియర్ & క్యాడెట్ తైక్వాండో క్యూరుగీ & పూమ్సే చాంపియన్‌షిప్ – 2025లో పాల్గొని అద్భుత విజయాలు సాధించారు.ఈ పోటీలలో సన్ స్కూల్ విద్యార్థి పీ. మనోజ్ (8వ తరగతి) 0-61 కిలోల విభాగంలో బంగారు పతకం, అలాగే వి. మోపాల్ (5వ తరగతి) జూ-53 కిలోల విభాగంలో వెండి పతకం సాధించారు.వీరు (శివ కరాటి అకాడమీ) మాస్టర్ శివా మార్గదర్శకత్వంలో శిక్షణ పొందారు. పథకాలు సాధించిన విద్యార్థులకు కరాటి మాస్టర్ ఆర్.శివ అభినందించారు. బహుమతులను డి.వి. చారి (జాయింట్ సెక్రటరీ – ఏపిటిఏ) మరియు సతీష్ కుమార్ (వైస్ ప్రెసిడెంట్ – విటా) చేతుల మీదుగా అందుకున్నారు.ఈ పోటీలలో మొదటి మరియు రెండవ స్థానాలు సాధించిన విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీలలో విజయనగరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌లలో పాల్గొననున్నారు అని పాఠశాల ప్రిన్సిపాల్ వై. భారతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు