Homeఆంధ్రప్రదేశ్మద్యం అమ్మకాలు సైతం పూర్తి పారదర్శకత తో

మద్యం అమ్మకాలు సైతం పూర్తి పారదర్శకత తో

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : నకిలీ మధ్యమా? కాదా? అన్నది క్యూ. ఆర్. కోడ్ ద్వారా  సులభంగా తెలుసుకోవచ్చని, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతి విషయం ఎంతో పారదర్శకంగా అమలు చేస్తోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాళ్లపూడి మండలానికి విచ్చేసిన సందర్భం లో బ్రాందీ షాప్ ను సడన్ గా చెక్ చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షం వాళ్ళ తీరు చూస్తుంటే దొంగలే దొంగ దొంగ అన్నట్లుందని, వల్ల హయం లో కనీసం మద్యం కు చెల్లించే డబ్బు కూడా నగదు రూపం లోనే తీసుకున్నారని, ఏ ఖాతాకు డబ్బు వెళ్ళేదో తెలిసేది కాదని, నకిలి మద్యం గతపాలకులే కేసుల్లో ఉన్నారని , ఎన్డియే ప్రభుత్వం పూర్తి పారదర్శకత తోపని చేస్తోందని అన్నారు. వినియోగ దారులు సైతం మద్యం క్యూ.ఆర్.కోడ్ ద్వారా నాణ్యమైన మధ్యాన్ని పొందవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే తో పాటు నాయకులు గణపతి కూచిపూడి, అన్నమరెడ్డి రమణ తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు