Homeజిల్లాలుకర్నూలుమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

- Advertisement -

విశాలాంధ్ర,కదిరి:కర్నూల్ జిల్లా,కల్లూరు మండలం, చిన్న టేకూరు బస్సు ప్రమాద ఘటనలో పలువురు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ జిల్లా చిన్న టేకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ప్రవేట్ బస్సు ఢీ కొట్టడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పలువురు సజీవ దహనం కావడం తీవ్రంగా కలిచి వేసిందన్నారు.ఈ ప్రమాద ఘటనపై పోలీసులు, ట్రాన్స్ పోర్టు అధికారులు క్షుణ్ణంగా పరిశోధన చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని ప్రభుత్వాన్నిసంబంధిత అధికారులను కోరారు.ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల్లో మనో ధైర్యాన్ని,ఆత్మస్థైర్యం నింపాలని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు