Homeజిల్లాలుఅనంతపురంచిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఈ. బి. దేవి

విశాలాంధ్ర- అనంతపురం : ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఈ.బి. దేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న జరుపుకునే ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రజలందరికీ తమ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మన జిల్లా మరియు దేశం పోలియో రహితంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని కోరారు. భారతదేశం 2014 సంవత్సరంలో పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందన్నారు ఇది ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని తెలియజేశారు. అయినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఇంకా పోలియో వ్యాధి ఉన్నందున జాగ్రత్త మరియు పూర్తి టీకా రక్షణ ఎంతో అవసరం అన్నారు. ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి ప్రతి జాతీయ మరియు ఉపజాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సమయంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇప్పటికే టీకాలు వేసుకున్న పిల్లలకు కూడా ఈ చుక్కలు అదనపు రక్షణను అందిస్తాయన్నారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పల్స్ పోలియో కార్యక్రమం మరియు రోటిన్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, తమ పరిధిలోని ప్రతి చిన్నారి టీకా రక్షణ పొందేలా కృషి చెయ్యాలన్నారు. మన అందరి కృషితోనే “పోలియో రహిత అనంతపురం – పోలియో రహిత భారతదేశం” సాధ్యం అవుతుందిని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు