Homeజిల్లాలుకర్నూలుగ్రామాల్లో దుర్వాసనతో కంపుకొడుతున్నా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు

గ్రామాల్లో దుర్వాసనతో కంపుకొడుతున్నా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతున్నా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల పారిశుధ్యం లోపించి కంపుకొడుతున్నాయని ఆరోపించారు. అధిక వర్షాల వల్ల డ్రైనేజీలలో పూడికతో నిండిపోయాయన్నారు. ఒక్క పంచాయతీ కార్యదర్శి గానీ డ్రైనేజీలను పూడిక తీయించలేదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టాల్సి ఉండగా ఇంతవరకూ పెట్టింది లేదని, రావడం కూర్చిలో కూర్చోవడం పోవడం తప్ప పనిచేసింది శూన్యమన్నారు.వీటన్నిటికి మండలంలో ఉన్న ఎంపీడీఓ, ఈఓఆర్డీ నిర్లక్ష్యమే కారణమన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, వీధి దీపాల సమస్యలు ఉన్నా పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా ఎంపీడీఓ నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, తిక్కన్న, నాయకులు నాగరాజు, వీరేష్, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు