Homeజిల్లాలువిజయనగరంరాజాంలో పి.ఏ.సి.ఎస్ అధ్యక్షుడు వంగా గోవింద ప్రమాణ స్వీకారం

రాజాంలో పి.ఏ.సి.ఎస్ అధ్యక్షుడు వంగా గోవింద ప్రమాణ స్వీకారం

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి.ఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) అధ్యక్షులుగా వంగా గోవింద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త అధ్యక్షుడిని అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, “రైతు సంక్షేమమే పి.ఏ.సి.ఎస్ ప్రధాన లక్ష్యం కావాలి. సహకార వ్యవస్థలు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వంగా గోవింద కి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు