విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… 2020 జూలై 20న కళ్యాణదుర్గం పట్టణంలో ఓ హత్య కేసులో బోయ రాజశేఖర్ కి యావజ్జీవ శిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం అనంతపురం మొదటి అదనపు జిల్లా సెషన్ జడ్జి సత్యవాణి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి నాగరాజు తన స్నేహితులైన చాకలి అంజి , రాజశేఖర్ లు మారంపల్లి లోని ఓ ఇంటి వెనకాల జూదమాడుతున్న సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. బోయ రాజశేఖర్ కట్టే తీసుకొని తలారి నాగరాజు తలపైన బలంగా కొట్టడంతో రక్త గాయమై స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం అనంతరం హాస్పిటల్ కి తరలించగా అక్కడ చనిపోయాడు. ఈ మేరకు హతుడి భార్య తలారి ఉష కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ శివశంకర్ నాయక్ హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తర్వాత వచ్చిన సీఐ తేజోమూర్తి దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పదిమంది సాక్షాలను విచారించగా నిందితుడు బోయ రాజశేఖర్ పై నేరం ఋజువు కావడంతో శుక్రవారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.2000 రూపాయలు జరిమానా విధిస్తూ జడ్జ్ సత్యవాణి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపి లక్ష్మీనారాయణ వాదన వినిపించారు. కేసులో అసలైన నిందితుడికి శిక్ష పడేలా చొరవ తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులను జడ్జి అభినందించారు


