జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బోయ శ్రీరాములు
విశాలాంధ్ర -అనంతపురం : పొగాకు కు యువత దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బోయ శ్రీరాములు పేర్కొన్నారు.
టోభాకో ఫ్రీ యూత్ కాంపెయిన్ 3.ూ సందర్భంగా శనివారం శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డ విద్యా సంస్థ శ్రీ కృష్ణ దేవరాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు ఆధ్వర్యంలో పొగాకు కు వ్యతిరేకంగా విద్యార్థులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు అవగాహన, ర్యాలీ నిర్వహించారు శ్రీ కృష్ణ దేవరాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డా. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ
సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు.శ్రీరాములు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ క్యాన్సర్ వంటి భయానిక వ్యాధులు రాకుండా నివారించుకోవాలన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని తెలియజేశారు. అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. పొగాకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ,, 60 రోజులలో 400 పాఠశాలలును పొగాకు రహిత విద్యాసంస్థలుగా అమలు చేయాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు మరియు ఎ ఓ, ముత్యాలప్ప మరియు వ్యవసాయ యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


