విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి మండల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం కేసిరాజు సీతారామయ్య గారి ఇంటి వద్ద బండి సూర్యప్రకాశ రావు అధ్యక్షతన జరిగింది. శాఖ సభ్యత్వం సమీక్షించడం జరిగింది. శాంతి రథం నిర్వహణ గురించి చర్చించడం జరిగింది. ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. పూర్వపు మానవతా సభ్యులు అందరూ రెన్యువల్ చేసుకోవాలని కోరుచున్నాము. సమయం తక్కువ ఉన్నది కావున 600 రూపాయలు ఫోన్ పే చేసినట్లయితే రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ కేశిరాజు వెంకట రాజ్ కుమార్ మండల కార్యదర్శి కూచంపూడి నరేష్ వర్మ ఉపాధ్యక్షులు ఆచంట సుభాష్ చంద్రబోస్ కోశాధికారి తీగల లక్ష్మీనారాయణ కేశిరాజు సీతారామయ్య నల్లమాటి లలిత ఆకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇట్లు దేవరపల్లి మండల మానవత శాఖ
మానవత సమావేశం
- Advertisement -
RELATED ARTICLES


