విశాలాంధ్ర – కొవ్వూరు : గామన్ బ్రిడ్జి వద్ద భారీగా గంజాయి తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు , పోలీసులు దాడిచేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఒరిస్సా లో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు కోయంబత్తూర్ కి తరలిస్తుండగా కొవ్వూరు గామన్ వంతెన పై కొవ్వూరు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. కొవ్వూరు గామన్ వంతెన పై గంజాయిని మార్చుతున్నట్టు ఎక్సైజ్ సీఐ జి. సత్యనారాయణ కు అందిన సమాచారంతో దాడులు నిర్వహించామని 86 ప్యాకెట్ లో ఉన్న 172 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ 8 లక్షలు ఉంటుందని అంచనా వేసామని ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం డొంకరాయి నుంచి కొవ్వూరు వరకు ఆటోలో గంజాయిని తరలించి గామన్ వంతెన పై ఆటో నుంచి లారీలో మారుస్తుండగా పట్టుకున్నామని లారీడైవర్ ఎం మాణిక్యం క్లీనర్ రాయర్ దేవర ఆటో డ్రైవర్ బి కుమార్ ను అరెస్టు చేశామని లారీని, ఆటోని సీజ్ చేసామని తెలిపారు.
కొవ్వూరులో గంజాయి పట్టివేత
- Advertisement -
RELATED ARTICLES


