విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని నష్టపోయిన కార్మికులను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాలని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఎంపీపీ వెలుగొండ నరసింహులు, పట్టణ అధ్యక్షులు ఈడిగ ప్రసాద్, ఆ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి ఎం. బసవరాజు, మండల కన్వీనర్ ఎర్రి స్వామి రెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల మగ్గం గుంతలలోకి నీరు చేరి ఒక్కో కార్మికుడుకి లక్ష రూపాయల నుంచి 50.000వేల వరకు నష్టం వాటిల్లిందనీ. చేనేత కార్మికులు కు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వాలని, పూచికత్తు లేకుండా రెండు లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు, నేతన్న నేస్తం ద్వారా రూ. 36 వేల రూపాయలు, 50 సంవత్సరాలకే చేనేత పింఛన్లు, 50 సంవత్సరాలు దాటినా అందని పెన్షన్ కూడా అమలుపరిచి చేనేత కుటుంబాలకు ఆసరాగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాల కారణంగా పట్టు నూలు జరీ, చేనేత చీరలు డ్యామేజ్ అయ్యాయనీ మగ్గం గుంతలో నీళ్లు చేరి పనులు లేక నేత నేయడానికి వీలుకాక పరిస్థితి నెలకొన్నది అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కుటుంబాల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో చేనేత సంఘం నాయకులు కరూరు వెంకటేశు, సోమశేఖర్, చందా బాలాజీ, పురిడి వేణు, శంకర్ పాల్గొన్నారు.


