Homeజిల్లాలుఅనంతపురంపొగాకు కు యువత దూరంగా ఉండాలి

పొగాకు కు యువత దూరంగా ఉండాలి

- Advertisement -

సీఐ రాజేంద్రనాథ్ యాదవ్
విశాలాంధ్ర -అనంతపురం : పొగాకు కు యువత దూరంగా ఉండాలని స్థానిక 3టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పేర్కొన్నారు. టోభాకో ఫ్రీ యూత్ కాంపెయిన్ 3.O సందర్భంగా ఈరోజు 3 వ పట్టణ పోలీస్ స్టేషన్, పరిసర ప్రాంతాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొగాకు ఒక వ్యతిరేకంగా ప్రజలలో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పొగాకు నియంత్రణ కార్యక్రమ సోషల్ వర్కర్ బోయ శ్రీరాములు మాట్లాడుతూ… , పొగాకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ,, 60 రోజులలో 400 పాఠశాలలును పొగాకు రహిత విద్యాసంస్థలుగా అమలు చేయాలని తెలియజేశార. బహిరంగ ధూమపానము చేసిన మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు జరిమానారూ:200 కూడా విధించడం జరుగుతుంది పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి ప్రచారం నిర్వహించ రాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు