రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
నేలకొరిగిన పంట పొలాలు పరిశీలన
విశాలాంధ్ర – నల్లజర్ల : తుఫాను తాకిడికి మండలంలోని సుమారు 1182 ఎకరాలు పంట కు నష్టం వాటిలిందని ఏవో సోమశేఖర్ తెలిపారు బుధవారం నల్లజర్ల లోని రైతు కూచిపూడి విఘ్నేశ్వర రావు వ్యవసాయ క్షేత్రంలో నేలకు ఒరిగిన వరినీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 3700 ఎకరాలు వరి పంట ఉండగా తుఫాను తాకిడికి 1182. ఎకరాలు వరి పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు తెలిపారు. సాధారణంగా 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో తుఫాను ప్రభావిత ప్రాంతంలోని నష్టపోయిన రైతుల తడిసిన ధాన్యాన్ని పూర్తి ధరకు కొనుగోలు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరారు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు


