Homeఆంధ్రప్రదేశ్తుఫాను బాధితులకు "చేయూత" నిచ్చిన ఉపాధ్యాయిని

తుఫాను బాధితులకు “చేయూత” నిచ్చిన ఉపాధ్యాయిని

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : మొంథా తుపాను బాధిత కుటుంబాలకు తన వంతు “చేయూత” ను అందించి, ఆదర్శంగా నిలిచారు ఆ ఉపాధ్యాయిని. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు, ఈదురు గాలులకు పలు బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి ప్రక్కన, చుట్టు ప్రక్కల గుడారాలు, డేరాలలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి మంగళవారం రాత్రి నుండి బుధవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం తరఫున భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. బుధవారం రాత్రి  వెంకాయమ్మపేట  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని, చేయూత తూర్పుగోదావరిజిల్లా ఇన్చార్జి మెంబరు అయిన సాకా అనిత సుమారు 60 మందికి భోజనాలు సమకూర్చి తనవంతు చేయూత నందించారు. అలాగే బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. ప్రభుత్వం కల్పించిన ముందస్తు చర్యలలో భాగంగా ప్రభుత్వానికి అండగా తనవంతు స్పూర్తితో చేసానని అనిత పేర్కొన్నారు. సిఆర్ఎంటి వెంకటేష్ సహకారం అందించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సాకా అనితకు బాధిత కుటుంబాలు, స్థానిక పెద్దలు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు