డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం;; అహోబిలంలో శ్రీ సాయి నృత్యాంజలి వారు మినిస్టరీ ఆఫ్ కల్చర్ ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్ వారి సహకారంతో నిర్వహించిన జాతీయస్థాయి నవ నారసింహ నిత్యోత్సవాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ లారీత్యాశ బృందం కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 20 మంది శిష్య బృందం పాల్గొన్నారు అని, భరతనాట్యం కూచిపూడి నాట్యం చేసి బాల ప్రహల్లాద అవార్డులు గురువులకు జ్వాలా నరసింహస్వామి అవార్డులను సంస్థ వ్యవస్థాపకులు పల్లెం శెట్టి సురేష్ అహోబిలం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి చేతులమీదుగా అవార్డులను అందుకోవడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నాట్య ప్రదర్శనలో రామలాలిత్యతోపాటు అర్చన, లీల,, దాత్రికా, దేవాన్షిత, యశస్విని, ఉదయశ్రీ, ప్రజ్ఞ,, జిష్టికా, నయానిక భవిజ్ఞా, హేమీషా, రితిమ, ఐసికా, అచ్యుతా, సాయి తదితరులు కూడా అవార్డులు పొందడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమములో మమ్ములను ఆహ్వానించినందుకు అహోబిలం ఆలయ కమిటీకి కృతజ్ఞతలను తెలిపారు.
అవార్డులు అందుకున్న శ్రీ లలితా నాట్య కళానికేతన్..
- Advertisement -
RELATED ARTICLES


