Homeఆంధ్రప్రదేశ్కంబాల విరాళం

కంబాల విరాళం

- Advertisement -

విద్యార్థుల మినరల్ వాటర్ ప్లాంట్  ఏర్పాటుకు కంబాల 20,000 రూపాయలు విరాళం.._

_వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం…_

విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి  20,000 రూపాయలు విరాళం అందజేశారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య ఉందని, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహాయం అందించాలని పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుని గతంలో కోరారు. స్పందించిన ఆయన సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా స్థానిక సీఎండీ కార్యాలయం వద్ద పాఠశాల టీచర్ సిధ్దాబత్తుల సునీల్ కుమార్ కు వాటర్ ప్లాంట్  ఏర్పాటుకు 20,000 రూపాయలు విరాళం అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన దొడ్డు శ్రీనివాసరావు, అతని భార్య సత్యవతి అనారోగ్యతో బాధపడుతుంది. ఆమె వైద్య ఖర్చులు సహాయం చేయాలని, ఆమె భర్త కంబాల శ్రీనివాసరావుని కోరగా స్పందించిన ఆయన పది వేలు రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు  బత్తుల నానాజీ, పెద్దాడ  వెంకన్న దొర, నాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.._

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు