ట్రంప్ జూనియర్ కు ఘన స్వాగతం పలికిన ఎంఆర్ పాలెం యువకుడు.
విశాలాంధ్ర – కడియం : భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తొలిసారిగా భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ జూనియర్ కు తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, మాధవరాయుడు పాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి తనయుడు, ఇంటర్నేషనల్ చార్టెడ్ ఫ్లైట్స్ అసోసియేషన్ సీఈవో అన్నందేవుల మణీంద్ర ఘనస్వాగతం పలికారు. ట్రంప్ జూనియర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆగ్రా లోని తాజ్ మహల్ దర్శించడంతో పాటు, రాజస్థాన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ పర్యటనలో ట్రంప్ జూనియర్ వెంట సిఈఒ మణీంద్ర ఉంటారు.


