Homeఆంధ్రప్రదేశ్అసెంబ్లీ కి విద్యార్థిని సంధ్య

అసెంబ్లీ కి విద్యార్థిని సంధ్య

- Advertisement -

మాక్ అసెంబ్లీ సమావేశానికి ఎంపికైన వీరవరం విద్యార్థిని సంధ్య.

విశాలాంధ్ర – కడియం : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి కడియం మండలం, వీరవరం గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంపికైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎబి రజని తెలిపారు. వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కందుకూరి సంధ్య, నవంబర్ 26 వ తేదీన అమరావతిలో జరగనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని సంధ్య, శిక్షణ నిచ్చిన ఉపాధ్యాయురాలు ఎబి రజిని లను పలువురు అభినందించారు. అభినందించిన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ పి కె విశ్వనాధ్,  గ్రామ సర్పంచ్ బత్తుల నళిని రాము, విద్యా కమిటీ చైర్మన్ గుమ్మడి నాగలక్ష్మి రాజు, ఎంఇఒ వన్ ఎంఎస్ మణికుమర్, ఎంఇఒ టు వై నాగేశ్వరరావు, విద్యా కమిటీ సభ్యులు, కూటమి నాయకులు,  గ్రామ పెద్దలు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు