ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలి.
— సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్.
విశాలాంధ్ర – కడియం : ప్రజలతో పోలీసులు స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్య కిషోర్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా కడియం పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నమోదు చేసిన కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి తొందరగా చార్జ్ షీట్ ఫైల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ అల్లు వెంకటేశ్వరరావు, ఎస్ఐ బి నాగ దుర్గాప్రసాద్, మహిళా ఎస్ఐ పి ధనలక్ష్మి ప్రసన్న, ప్రొఫెషనరీ ఎస్ఐ వై రామకృష్ణ, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


