గ్రీన్ అంబాసిడర్లచే పచ్చదనం పరిశుభ్రత
విశాలాంధ్ర – సీతానగరం: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లచే ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో కె వి ఎస్ ఎస్ ఎస్ మూర్తి పర్యవేక్షణలో సీతానగరం గ్రామంలో శుక్రవారం పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా అన్ని గ్రామాల సుమారు 70 మంది గ్రీన్ అంబాసిడర్లచే పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో బాగంగా సీతానగరం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రం చేశారు. అలాగే చెత్త సంపద కేంద్రం నందు చెత్త నుండి సంపదను ఎలా సృష్టించాలో శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ భారతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్రలో బాగంగా గ్రామాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించి అనేక కార్యక్రమాలను చేపడుతుంది అని అన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ అధికారులు, గ్రీన్ అంబాసిడరులు పాల్గొన్నారు.


