పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అంబాసిడర్లు పాత్ర కీలకం
-గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో ఝాన్సీరాణి
విశాలాంధ్ర – రాజానగరం : గ్రాములు పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అంబాసిడర్లు పాత్ర ఎంతో కీలకమని ఎంపిడివో జె.ఏ. ఝాన్సీ రాణి అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపిడివో కార్యాలయ ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా గ్రీన్ అంబాసిడర్లు మరియు గ్రీన్ గార్డులుకు సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీవో ఝాన్సీరాణి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తీసుకోవలసిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ మరియు ఎనర్జీ కన్జర్వేషన్ వంటి పట్టణ పర్యావరణ సమస్యల ను పరిష్కరించడంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రీన్ అంబాసిడర్లు మరియు గ్రీన్ గార్డులకు అందించే శిక్షణ కార్యక్రమాలు వారిని పర్యావరణ పరిరక్షణలో నిష్ణాతులుగా చేయడానికి రూపొందించబడ్డాయన్నారు. మండలంలోని అన్ని గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణా తరగతులు అందించినట్లు ఎంపీడీవో తెలిపారు.ఈ సదస్సులో సీనియర్ అసిస్టెంట్ ఎం.సుబ్రమణ్యం, ఇంచార్జి ఈవోపిఆర్డి వెంకట రెడ్డి,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, పంచాయితీ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు
గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో
- Advertisement -
RELATED ARTICLES


