Homeఆంధ్రప్రదేశ్ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండల పైడిమెట్ట బేసిక్ ప్రాథమిక పాఠశాల వేదికగా శనివారం ఏపీటీఎఫ్ తాళ్లపూడి మండల శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో  తాళ్లపూడి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని  ఎన్నిక చేసినట్లు ఎలక్షన్ అధికారిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు దున్నా దుర్గారావు తెలిపారు.  ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం ఏపీటీఎఫ్  ఉపాధ్యాయ సమస్యలపై మరింతగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులచే ప్రమాణం చేయించారు. కమిటీ సభ్యులు రెండు సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటారని దుర్గారావు తెలిపారు. ఎన్నిక పరిశీలకులుగా పూర్వ అధ్యక్షులు రఘువీర శాస్త్రి, నాని వ్యవహరించారు.  తాళ్లపూడి మండల ఏ.పి.టి.ఎఫ్  శాఖ నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు గా వై శంకరం, అధ్యక్షులుగా కె.ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం శోభన్ బాబు, ఉపాధ్యక్షులు గా జి రాజారత్నం, పి.కనక దుర్గ, వి శాంత కుమారి, కార్యదర్శిలుగా జి వి కె రాజు, టి. రమాదేవి, కె మంజు, సి హెచ్ భాస్కర్ ఎన్నికయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు