
అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు
విశాలాంధ్ర – నల్లజర్ల : జైల్లో ఉన్న పరిచయాలను వాడుకునీ టీం గా తయారై పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ టీం గా తయారైన మధ్యప్రదేశ్ కు చెందిన తార్ టీంను వలవేసి పట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నల్లజర్ల లో ఒంటరి మహిళలు టార్గెట్ చేసి బండరాయితో తలపై దాడి చేసి బంగారు వస్తువులను అపహరించిన కేసులో కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు టీమ్ గా ఏర్పడి ముద్దాయిలను అరెస్టు చేశారు ఈ సందర్భంగా శనివారం నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు గతంలో ఒరిస్సా రాష్ట్రంలో పోలీసులు పై కాల్పులు జరిపి తప్పించుకున్న ముద్దాయిలు వీళ్ళలో వున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని వారి వద్ద నుంచి ఒక కారు, రెండు బైకులు, మూడు లక్షల నగదు, 26 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర నాయక్, నల్లజర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు నల్లజర్ల సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, జిల్లా క్రైమ్ ఎస్సై రవీంద్ర సిబ్బంది పాల్గొన్నారు. అంతర రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించారు.


