Homeఆంధ్రప్రదేశ్మార్గాని నర్సరీలో

మార్గాని నర్సరీలో

- Advertisement -

మార్గాని నర్సరీలో నేతల సందడి.

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా కడియం గౌతమీ నర్సరీ లో ఆదివారం పలువురు నేతలు సందడి చేశారు. స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ సోదరుడు గౌతమీ నర్సరీ అధినేత మార్గాని వీరబాబు నర్సరీలో జరిగిన విందు కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, మాజీ ఎంపీ మార్గాని భరత్, ప్రముఖ వ్యాపారవేత్త మార్గాని నాగేశ్వరరావు పలువురు టిడిపి, జనసేన, బిజెపి, వైసిపి నాయకులు పాల్గొన్నారు. నర్సరీ, రాజకీయ, సామాజిక రంగాల్లో మంచి గుర్తింపు సాధిస్తున్న మార్గాని సోదరులను అభినందించారు. వారి తల్లిదండ్రులు స్వర్గీయ మార్గాన్ని శేషయ్య, సావిత్రమ్మ దంపతుల పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు విస్తరించడం ఆదర్శనీయమన్నారు. సమాజంలో మనం ఎదగటమే కాదు తోటి వారికి సాయపడాలన్న మార్గాన్ని సోదరుల సిద్ధాంతం అందరికీ అనుచరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ తిలక్ కుమార్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, మండల జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి,, కూటమి నాయకులు గట్టి సుబ్బారావు, పంతం గణపతి రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి,వైసీపీ నాయకులు ఈలి గోపాలం, బీసీ నాయకులు అత్తిలి రాజు రేలంగి శేఖర్, తొట్టా సత్తిబాబు, పలువురు ప్రముఖ నర్సరీ రైతులు  పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు