Homeఆంధ్రప్రదేశ్ధాన్యం కులాలుగా మారిన ప్రధాన రహదారి

ధాన్యం కులాలుగా మారిన ప్రధాన రహదారి

- Advertisement -

– ప్రధాన రహదారి పై తిరగబడ్డ ప్రయాణికులతో ఉన్న ఆటో

విశాలాంధ్ర – సీతానగరం: రాజమహేంద్రవరం, సీతానగరం ప్రధాన రహదారి ధాన్యం కులాలుగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఆదివారం మునుకూడలి గ్రామంలో సీతానగరం నుంచి రాజమహేంద్రవరం ప్రధాన రహదారి ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న ఆటో రోడ్డు పై ఉన్న ధాన్యం రాశులను పైకి ఎక్కి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొద్ది పాటి దెబ్బలతో బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలాగ ఉండగా ఖరీఫ్ సీజన్ కోతలు ప్రారంభం కావడంతో ప్రధాన రహదారి అనుకోని ఉన్న గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యంను ప్రధాన రహదారి పైకి తరలించి రోడ్డు పైన కాలాలను చేసి అరబెడుతున్నారు. దీనివల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పై పోలవరం ప్రాజెక్టు బారి వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఆటోలో, ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ప్రవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు రాజమహేంద్రవరం వివిధ దుకాణాలు, వ్యాపారాలు, ఉద్యోగులు అనునిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ఈ రద్దీ రహదారిపై ఎక్కడి అక్కడ రోడ్డు బ్లాక్ చేసి ధాన్యం కాలాలను మారుస్తున్నారు. దీనితో రోడ్డు పై ప్రయాణం చేయాలి అంటే వాహనదారులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. దీనిపై ప్రయాణికులు రోడ్డు విస్తరణ కాక ముందు రైతులు ధాన్యం ఎక్కడ ఆరబెట్టుకునేవారు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని వహదారులు ఆరోపిస్తున్నారు. ఏదైనా పెను ప్రమాదం జరగకముందే రైతులకు సర్ది చెప్పి అధికారులు ప్రధాన రహదారిపై దాన్యం కాలాలను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు