కర్లపూడి చిన్నబ్బాయి.
విశాలాంధ్ర – గోపాలపురం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కర్లపూడి జలావతి చిన్నబ్బాయి దంపతులు అన్నారు. బాబా వారి శత జయంతి ని పురస్కరించుకొని స్థానిక లలితాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న సత్య సాయి బాబా వారి ఆలయం వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జలావతి చిన్నబ్బాయి దంపతులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు నుండి ప్రతి ఏటా బాబా వారి జయంతిని పురస్కరించుకుని భక్తులకు నూతన వస్త్ర, అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బాబా వారి పుట్టినరోజు సంఖ్య ను బట్టి 100 మంది పేదలకు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నామన్నారు. అలాగే ప్రతినిత్యం బాబా వారికి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నగర సంకీర్తన, సాయంత్రం హారతి, జ్యోతి ప్రజ్వలన, ఒంటి కార్యక్రమాలు భక్తులు చేపట్టారు. ఆలయం నిర్మాణం నుండి బాబా వారికి ప్రత్యేక పూజలు నిరంతరం చేస్తున్న సాయిరాం, గేదెల మంగాయమ్మ, కోయ రాజేశ్వరి, బాలగోపాల భాస్కరరాజు, తానింకి సత్యవతి, బుల్లాయమ్మ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంట్రప్రగడ వెంకటేశ్వరరావు,చదలవాడ సత్య,కాకర్ల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.


