ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవ చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
విశాలాంధ్ర – నిడదవోలు : ఆధ్యాత్మిక సేవతో పాటు విద్య వైద్యాన్ని అందించిన గొప్ప సామాజికవేత్త భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని మండల ప్రజాపరిషత్తు ఏవో వి ఎస్ వి ఎల్ జగన్నాధ రావు అన్నారు.నిడదవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 100వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆధ్యాత్మికతకు సామాజిక సేవను జోడించి విద్యాతో పాటుగా వైద్యాన్ని, సత్యసాయి నీటి సరఫరా పథకం ద్వారా ప్రజల దాహత్తిని తీర్చిన గొప్ప ఆధ్యాత్మికవేత్తని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సత్యసాయి సత్సంగం సభ్యులు, ఏవో జగన్నాథరావు,మండలం జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఎంపీటీసీ వాక శ్రీను,సమిశ్రగూడెం సొసైటీ అధ్యక్షులుఉప్పులూరి రామ్మోహనరావు, చౌదరి, కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


