
విశాలాంధ్ర – తాళ్లపూడి: శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవం సందర్భన్గా ఆదివారం రోజున సత్యసాయి కమీటీ అద్వర్యం లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాళ్లపూడి మండలం నుండి 100 మందికి పైగా పుటపర్తి వెళ్లారని సాయి కమిటీ సభ్యులు తెలిపారు. కాగా స్తానిక గీతమందిరం వద్ద పూజలు ప్రార్ధనలు జరిపి, అనంతరం పేద వారికి 100 మందికి అన్నదానం, వస్త్ర దానం చేశారు. సొలస రత్నజి, విశ్రాంత ఉపాధ్యాయులు మోపిదేవి సోమరాజు, బాణాల మూర్తి పలువురు మహిళలు అధిక సంఖ్య లొ పాల్గొన్నారు. కాగా సత్య సాయి శతజయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కూడా చేపట్టాలన్న ఆదేశాల మేరకు పలు పంచాయతి కార్యాలయాల్లో బాబా చిత్రపటం పెట్టి నివాళు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయం లో జరగగా కార్యదర్శి డి.ఎస్.శ్రీనివాస్, ఇంచార్జి ఈ.ఓ.పి.ఆర్.డి వీరన్న, ఎన్.ఆర్.జి.ఎస్ ఏ.పి.ఓ రమాదేవి, వి.ఆర్.ఓ.లు, సిబ్బంది పాల్గొన్నారు.


