- Advertisement -
కోటి సంతకాల సేకరణలో వైసిపి శ్రేణులు
విశాలాంధ్ర – నిడదవోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు ఆదేశాలు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిడదవోలు మండలంలో పలుచోట్ల నిర్వహించారు. సమిశ్రగూడెంలో నిర్వహించిన సంతకాల సేకరణలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షులు గజ్జరపు శ్రీ రమేష్, డి. ముప్పవరం లో సత్తిపండు, నిడదవోలులో కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంతకాలను సేకరించారు.


