- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం మన భారతదేశం అని ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తైల సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న మహనీయుల విశేషాలను వివరించారు.విద్యార్థులచే ఉపాధ్యాయులచే మరియు బోధనా బోధన సిబ్బందిచే భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి గోపీనాథ్ , డిప్యూటీ రిజిస్ట్రార్ బి. దుర్గాప్రసాద్ , బోధన, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


