Homeజిల్లాలుపార్వతీపురం మన్యంపార్వతీపురంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ షోరూమ్‌ ను ప్రారంభించిన అనసూయ

పార్వతీపురంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ షోరూమ్‌ ను ప్రారంభించిన అనసూయ

- Advertisement -

విశాలాంధ్ర, పార్వతీపురం: అన్నివర్గాలవారికి అనుకూలమైనధరలతో పాటు నాణ్యత కలిగిన వస్త్రాలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో లభ్యంకావడంతోపాటు పార్వతీపురం జిల్లాలో ఏర్పాటుచేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ప్రముఖ సినీతార అనసూయ భరద్వాజ, ఎమ్మెల్యే విజయ్ చంద్రలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరిస్తున్న సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ వినియోగదారులకు సంక్రాంతి పండుగ మరియు రాబోవు వివాహవేడుకల సందర్భంగా వినూత్నమైన ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ, సరికొత్త షాపింగ్‌ అనుభూతిని అందించే విధంగా పార్వతీపురం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రక్కన 39వ షోరూమ్‌ ను శుక్రవారంనాడు వారు ప్రారంభంచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కలెక్షన్లతో పండుగ వాతావరణాన్ని ముందుగానే ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులను అన్ని విధాలుగా సంతృప్తి పరుస్తుందని తెలిపారు.
ఆర్‌.ఎస్‌.బి రిటైల్‌ ఇండియా లి. డైరెక్టర్లు పార్వతీపురంలోని షాపింగ్‌ప్రియులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. కుటుంబంలోని అన్నితరాల వారి అభిరుచుల మేరకు అద్భుతమైన షాపింగ్‌ అనుభూతిని పంచే విధంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందజేయగలమని హామీ ఇచ్చారు.
సంస్థ ఛైర్‌పర్సన్‌, హోల్‌-టైం డైరెక్టర్‌ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూమ్‌ ద్వారా 39వ మైలురాయిని చేరుకోవడం తమకు ఆనందదాయకమని, పార్వతీపురంవాసుల అభిరుచుల్ని ప్రతిబింబించే వెరైటీలను అందించగలమన్నారు.సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పర్వదినాలకు మరింత శోభనిచ్చే షాపింగ్‌ అనుభూతిని తమ సరికొత్త షోరూమ్‌ తప్పకుండా అందజేయగలదని హామీఇచ్చారు.
హోల్‌-టైం డైరెక్టర్‌ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినానికీ, అదేవిధంగా రాబోయే వివాహ వేడుకలకూ సరిపోయే వస్త్రశ్రేణిని కొనుగోలు చేసేందుకు మా సరికొత్త షోరూమ్‌కు తప్పకుండా విచ్చేయమని పార్వతీపురం వస్త్రాభిమానుల్ని వినయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
పార్వతీపురంలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌లో సంప్రదాయం మొదలుకుని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ, కుటుంబంలోని అన్ని తరాల వారినీ అలరించే విధంగా పండుగ చీరెలు, పెళ్ళి పట్టుచీరలు, పట్టు వెరైటీలు, డ్రెస్ మెటీరియల్ సౌత్ ఇండియా మాల్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు