ఆలయ అధ్యక్షులు సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్య గుట్టలో నిర్మాణం అవుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు వివిధ రూపాలలో దాతలు విరాళాన్ని అందించడం ఎంతో శుభదాయకమని ఆలయ కమిటీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు సంకారపు జయ శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి. రామాంజనేయులు ధర్మవరం పట్టణం ద్వారా రూ.25,200లు, అలాగే సానే హనుమంత రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిల ద్వారా రూ.20,000 నగదును, చెక్కును అందించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం వేగవంతంగా పుంజుకున్నదని, ఇంతవరకు దాతలు నగదు రూపంలో ఇచ్చిన వారందరికీ సంకారపు జై శ్రీ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పేరుపేరునా కృతజ్ఞతలను తెలుపుతూ, వారి పేరిటన ఆలయములో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దాదాపు 300 సంవత్సరాల కిందట ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెలిసినదని, ఎంతో మహిమాన్విత ఆలయము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆలయానికి విరాళం అందించడం శుభదాయకం
- Advertisement -
RELATED ARTICLES


