వెటర్నరీ డాక్టర్ శేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో లాభదాయకమని వెటర్నరీ డాక్టర్ శేఖర్ తెలిపారు. ఈ వారు మాట్లాడుతూ మండల పరిధి లో గల అన్ని గ్రామ పంచాయతీల యందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరముల నిర్వహణ చేశామన్నారు. ఇందులో భాగంగా ముచ్చురామి గ్రామంలో శిబిరం నిర్వహించడం జరిగిందని,దీనిలో రైతు సోదరులు అందరూ పశుభీమా సద్వినియోగం చేసుకోవాలి అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పశువులకు 30,000 వేలకు 85 శాతం రాయితీ తో 15శాతం రైతు వాటా గా 298/-రూపాయలు చెల్లించవలెను అని తెలిపారు. భీమా 3 సంవత్సరంలు వర్తించును అని తెలిపారు. శిభిరం లో చూలు కట్టని పశువులు చూడి నిర్ధారణ పరీక్షలు, బాహ్య పరాన్నజీవుల నివారణ కోసం గోమార్ల మందు పిచికారీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 51 పశువుల కు తగిన చికిత్సలు చేయడం జరిగిందన్నారు. ముచ్చురామి గ్రామం లో గొర్రెలు ,మేకల లో అంతర పరాన్న జీవుల నివారణ కోసం ఉచిత డీవార్మింగ్ మందులను 2400 జీవాలు కలిగిన గొర్రెల కాపారులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యసహాయకులు, గోలమిత్రలు రైతు సోదరులు పాలొన్నారు. అదేవిధంగా ఈనెల 22వ తేదీ
గురువారం దరిశినమల, వెంకటతిమ్మాపురం గ్రామం లో ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
ఉచిత పశువైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో లాభదాయకం
- Advertisement -
RELATED ARTICLES


