ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;;. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, ఎంపీడీవో సాయి మనోహర్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం “మన ఊరు – మన నీరు” అనే థీమ్‌తో వారు నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు,మండల స్థాయి అధికారులు పిడిఓ లు పాల్గొని ఓపెన్ డిస్కషన్ నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో ప్రధానంగా నీరు ,పారిశుధ్యం మెరుగుదల, భూముల రీ-సర్వే, హ్యాండ్ పంపుల స్థితి, పాఠశాల డ్రాప్అవుట్ల తగ్గింపు, 14 ఏళ్ల పిల్లలకు హెచ్ పి వి టీకా అవగాహన, స్క్రబ్ టైఫస్ అవగాహన, వీధి దీపాల మరమ్మతులు , హబ్ అంగన్వాడీల తదితర అంశాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సాయి మనోహర్ మాట్లాడుతూ,మనందరి సహాయ–సహకారాలతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు. బలహీన వర్గాలకు చివరి మైలు వరకు సేవలు చేరేలా అందరం కలసి అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మన ఊరు – మన నీరు అనే థీమ్‌తో ధర్మవరం మండల సర్వసభ్య సమావేశం..
- Advertisement -
RELATED ARTICLES


